అరుదైన రికార్డు ముందు విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలో మెరవనున్నాడు
ఇప్పటికే టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం భారత్ తరపున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, అజేయంగా 74 పరుగులు సాధించాడు
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ లో కోహ్లీ ఓ అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీకి కేవలం ఒక్క సెంచరీ మాత్రమే అవసరం
ప్రస్తుతం టెస్టుల్లో సచిన్, వన్డేల్లో కోహ్లీ చెరో 51 సెంచరీలతో సమంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ ఒక్క శతకం బాదినా, ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు
దక్షిణాఫ్రికాపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 వన్డే ఇన్నింగ్స్‌లలో 65.39 సగటుతో 1,504 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి
దక్షిణాఫ్రికాతో రాంచీలో నవంబర్ 30న తొలి వన్డే జరగనుండగా, డిసెంబర్ 3న రాయ్‌పూర్‌, 6న విశాఖపట్నంలో మరో మ్యాచ్ జరగనుంది