టీమిండియా మాజీ సారథి 'విరాట్ కోహ్లీ' సంపాదనకు సంబంధించిన వివరాలను బయటపెట్టిన ఓ మ్యాగ్‌జైన్

కోహ్లీ నికర ఆదాయం రూ.1050 కోట్లు.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి మాత్రమే ఇది దక్కింది
బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో 'ఏ' గ్రేడ్‌, సంవత్సరానికి రూ.7 కోట్ల పారితోషికం, ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు చొప్పున మ్యాచ్ ఫీజ్, రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రతి ఏడాది రూ.15 కోట్లు
18కి పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీ. ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లు.. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్‌లో రూ.80 కోట్ల ఇల్లు
కోహ్లీ తన ఇన్‌స్టా ఖాతాలో ఒక్క వ్యాపార ప్రకటనను రూ.8.9 కోట్లు, ట్విటర్‌లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు
వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్‌ఎస్‌బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్‌ఆర్‌ఎప్, సింథాల్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
కోహ్లీకి సొంతంగా రెండు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్‌ల్లో కూడా భాగస్వామి
ఎమ్‌పీఎల్, డిజిట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, బ్లూట్రైబ్ వంటి కంపెనీల్లో కోహ్లీ పెట్టుబడులు
కోహ్లీ వద్ద ఉన్న కార్ల విలువ రూ.30 కోట్ల పైమాటే. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చూనర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు