విజయ్ దేవరకొండపై పనిగట్టుకుని ట్రోల్స్ చేయాల్సిన అవసరమేమిటి.. ఎవరికి ఉంది?

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్డమ్ ను సొంతం చేసుకున్న హీరో. ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో ఎంతో మందికి దక్కని భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు
ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమాలు ఆశించినంత ఫలితాలను దక్కించుకోలేకపోయాయి
ఈ అపజయాల నుండి తప్పకుండా బయట పడతానని.. మంచి సినిమాలతో మీ ముందుకు వస్తానంటూ హామీ ఇచ్చాడు
విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన 'కల్కి 2898 ఏడీ' లో అర్జునుడి పాత్రలో మెరిశాడు. అది కూడా చాలా తక్కువ స్క్రీన్ టైమ్. ఉన్నంతలో థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది
అయితే బయట పరిస్థితి మరోలా ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్. అర్జునుడిగా అర్జున్ రెడ్డి హీరో ఏంటి.. ఎందుకు తీసుకున్నారంటూ నెగటివ్ ట్రోల్స్
అలా షో పడగానే విజయ్ దేవరకొండ లుక్, డైలాగ్స్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరిగింది. సినిమా చూసిన వాళ్లేమో విజయ్ దేవరకొండ బాగా చేశాడని, అతని లుక్ కూడా బాగా ఉందని ప్రశంసలు కురిపించారు
అయితే సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ అర్జున లుక్ పై కొందరు పనిగట్టుకుని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. థియేటర్లలో విజయ్ దేవరకొండ రాగానే మంచి స్పందన వస్తోంది. కానీ అతడిని చూడడానికే ఎవరికీ ఇష్టం లేదన్నట్లుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు
ఈ ట్రోలర్స్ అందరికీ విజయ్ దేవరకొండ గట్టిగా సమాధానం ఇచ్చాడు. సినిమాలోని అర్జున లుక్ ఉన్న చిత్రాన్ని తన X/Twitter ఖాతాలోనూ, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ తన DPగా పెట్టేశాడు
దీంతో ట్రోలర్స్ కు విజయ్ దేవరకొండ మంచి రిప్లై ఇచ్చాడంటూ అభిమానులు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ మీద పనిగట్టుకుని నెగటివ్ ప్రచారం చేస్తోంది ఎవరు? అంత అవసరం ఎవరికి వచ్చిందంటూ చర్చించుకుంటూ ఉన్నారు నెటిజన్లు