మునక్కాయలో డైటరీ ఫైబర్.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి
మునక్కాయ లో ఉండే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు.. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి
మునక్కాయల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ చికిత్సకు సహాయపడతాయి. ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి
మునక్కాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి
మునక్కాయలోని డైటరీ ఫైబర్ పేగు కదలికలను సులభం చేసి గట్ హెల్త్‌కు మేలు చేస్తుంది. కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది
మునక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడతాయి. మన జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది
అధిక రక్తపోటు ఉన్న రోగులకు మునక్కాయ చాలా మేలు చేస్తుంది. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాక రక్తపోటును నియంత్రిస్తుంది
మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి