ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించి మళ్ళీ నటన మొదలుపెట్టింది

సోనాలి బింద్రే 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను ఎదుర్కొంది
చికిత్స తీసుకున్న ఆమె క్యాన్సర్ ను జయించి బయటపడింది. కోలుకోవడానికి కారణం సోనాలి సంకల్ప బలమే..!
మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించింది. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్
ముంబైలో కొంతకాలం చదివిన సోనాలీ ఆ తర్వాత బెంగళూరులోనూ చదువు కొనసాగించింది
చదువుకొనే రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది బింద్రే. మొదటి సినిమా ‘ఆగ్’ సినిమాతోనే ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు సరసన నటించింది సోనాలీ బింద్రే
తెలుగులో ‘మురారి’, ‘ఇంద్ర’, శంకర్ దాదా ఎంబీబీఎస్, మన్మధుడు, పలనాటి బ్రహ్మనాయుడు, ఖడ్గం సినిమాలలో నటించింది
దర్శకనిర్మాత, రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్లిచేసుకుంది.. వీరికి ఓ అబ్బాయి, పేరు రణవీర్
ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొని జయించిన సోనాలి ఎందరికో స్ఫూర్తి