ఎరుపు రంగు చీరలో మెరిసిన అనుపమ

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతూ ఉంది
రెండో వారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఉగాది హాలిడే, రంజాన్ హాలిడేలు కూడా కలిసి రావడంతో టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్ల ఓనర్లకు కాసుల వర్షం కురిపిస్తూ ఉంది
ఈ సినిమాలో లిల్లీగా కనిపించింది అనుపమ పరమేశ్వరన్. అసలు అనుపమను ఇంత హాట్ గా చూడగలమా అని కూడా అభిమానులు షాక్ అయ్యారు
ఇటీవల జరిగిన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరైనప్పుడు ఊహించని సంఘటన జరిగింది
ఎన్టీఆర్ అభిమానులు టిల్లు స్క్వేర్ నటి అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇబ్బందులు సృష్టించారు. అయితే అనుపమ వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు
మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ నటించారు.
ఇటీవల జరిగిన సక్సెస్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అనుపమ పరమేశ్వరన్ పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు