భారత జాతిపిత మహాత్మగాంధీ 1869లో అక్టోబర్ 02న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. అహింస మార్గంలో పోరాడి బ్రిటీషర్లను భారత్ నుండి వెళ్లిపోయేలా చేసిన ఓ శక్తి.

అక్టోబర్​ 2న.. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి.
గాంధీజి పుట్టింది శుక్రవారం నాడు. ఆయన మరణించింది శుక్రవారం నాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కూడా శుక్రవారమే.. అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చిన తరువాత మొదటిసారి చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నీలిమందు రైతుల తరుపున ఆయన పోరాడారు. ఆ సమయంలో రైతులు ఆయనను మహాత్మ అని సంబోధించారు.
గాంధీజీ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఫొటోలను తీయడానికి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించేది కాదు. ఆయన ఫొటోలు బయటికి వెళ్తే.. స్వాతంత్య్ర పోరాటం ఎక్కడ తీవ్రతరమవుతుందనే భయంతో ఫొటోలను అనుమతి ఇవ్వలేదు.
1930లో మహాత్మా గాంధీకి 'మ్యాన్​ ఆఫ్​ ది ఇయర్​' బిరుదును ఇచ్చింది టైమ్​ మ్యాగజైన్​. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు గాంధీ
గాంధీజీ తన 13వ ఏటనే వివాహం చేసుకున్నారు. తన కంటే ఏడాది పెద్ద అయిన కస్తూర్భా ను పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యం 62 ఏళ్ల పాటు కొనసాగింది
గాంధీ భార్య కస్తూర్భా 1944లో ఆగాఖాన్ ప్యాలెస్ నిర్భందంలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణించిన ఫిబ్రవరి 22న భారతదేశంలో మదర్స్ డే గా జరుపుకుంటారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందే మహిళల హక్కుల కోసం పోరాడారు గాంధీ
మహాత్మా గాంధీ రాసిన ఆటోబయోగ్రఫీ "మై ఎక్స్​పరిమెంట్స్​ విత్​ ట్రూత్​" 1927లో పబ్లిష్​ అయింది. 20వ శతాబ్దాంలో 100 మోస్ట్​ ఇంపార్టెంట్​ స్పిరిట్చ్యువల్​ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది​. ఆహారం గురించి 'ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు గాంధీజీ