చలికాలంలో నారింజను తినడం మంచిది. నారింజ పండ్లను తినడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శీతాకాలంలో ఇన్ఫెక్షన్, జలుబు, వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
జామపండులో విటమిన్లు సి, ఎ, ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. రోజూ ఒక జామపండు తీసుకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. జలుబు, దగ్గు మీకు దూరమవుతాయి
దానిమ్మ పండు హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఈ పండును మీ ఆహారంలో చేర్చాలి
క్యారెట్ లో విటమిన్ ఎ క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్‌తో ఉండే ఈ క్యారెట్లు మీ కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
క్యారెట్‌లో విటమిన్ సి, కె కూడా ఉన్నాయి, బలమైన రోగనిరోధక వ్యవస్థ, ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
నువ్వుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు మూలం. రక్తహీనతను నివారిస్తాయి
పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. పాలకూర రక్త హీనతను నివరించడంలో సహాయపడుతుంది
పాలకూరలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పాలకూర కంటి ఆరోగ్యానికి దోహదపడే లుటిన్, జియాక్సంతిన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది
చలికాలంలో బెల్లం ఆహారంగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం శరీరంలోని వేడిని సరిచేస్తుంది.
తీపి వంటకాలు చేయడానికి బెల్లం ఉపయోగించవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.