గురక సర్వ సాధారమైపోయింది. అయితే గుర వల్ల పక్కన నిద్రించే వారు ఇబ్బంది పడతారు.
గొంతులోని కండరాలు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వైబ్రేట్ అయినప్పుడు శబ్దం వచ్చి గురక మొదలవుతుంది.
నిద్రించే గదిలో పొడి గాలి ఉండటం వల్ల చాలా మందిలో గురక వస్తుంది. నాసికా రంధ్రాలు, గొంతు పొడిగా మారడం వల్ల గాలి కదలికకు ఇబ్బందులు తలెత్తుతాయి.
ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసక్రియపై పట్టు పెరుగుతుంది. అలా చేస్తే ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
ప్రాణాయామం చేయడం వల్ల గురక మాత్రమే కాకుండా నిద్రకు సంబంధించిన అనేక సమస్యలు దూరం అవుతాయి.
గొంతు, నాలుకలోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా గురకను అడ్డుకోవచ్చు.
అధిక బరువు ఉండటం కూడా గురకకు కారణం అవుతుంది.
గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా కారణం అవుతుంది. దూరంగా ఉంటేనే మంచిది.
నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది. దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. నిద్రించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.