దోమల వలన వివిధ రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి
వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో దోమలు లేకుండా.. దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు పడాలి
దోమలు లేకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.. మీ ఇంట్లో మీ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచానికి దోమతెరని కట్టుకుంటే దోమలు కుట్టవు
కర్పూరం, వెల్లుల్లి రసం, నిమ్మ, లవంగాలు ఇవన్నీ కూడా దోమలని పారిపోయేలా చేస్తాయి.. వేప ఆకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి
యూకలిప్టస్ ఆయిల్ నిమ్మగడ్డి నూనె లావెండర్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగిస్తే దోమలు కుట్టవు
తలుపులు , కిటికీలను తగిన సమయంలో మూసివేయడం ద్వారా మీ ఇంటి నుండి దోమలు, కీటకాలనుంచి రక్షించుకోవచ్చు
దోమ కాటునుంచి కొన్ని గంటల్లోనే ఉపశమనం లభిస్తుంది. అయితే దురద చాలా రోజుల పాటు ఉన్నా.. లేదా ప్రభావిత ప్రాంతం ఎక్కువసేపు ఉబ్బి ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి
కీళ్ల నొప్పులు లేదా తలనొప్పి, జ్వరం, విరేచనాలు , వాంతులు లేదా దద్దుర్లు వంటి కొన్ని ఇతర లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి