కల్కి ఈవెంట్ లో దీపిక పదుకోన్ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో నిర్వహించారు
ఈవెంట్‌కు ముందు, దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన బేబీ బంప్ చిత్రాన్ని పంచుకుంది
ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా, ముంబైలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దీపిక కూడా భాగమైంది
ఈ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించినప్పటికీ.. ఇంటర్నెట్‌లో దీపిక ఈ ఈవెంట్ లో వేసుకున్న దుస్తుల గురించి బాగా చర్చ జరుగుతూ ఉంది. ఆమె బేబీ బంప్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా తయారు చేశారు
'లోవీ' అనే బ్రాండ్ దీన్ని తయారు చేసింది. దీని ధర చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ డ్రెస్ ధర 1.2 లక్షల రూపాయలు. ఈ వార్త కొద్దిసేపటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది
కల్కికి జన్మనివ్వబోయే గర్భిణీ స్త్రీ 'సుమతి' పాత్రలో ఈ సినిమాలో దీపిక నటించింది. ఇక విడుదలకు ముందే సినిమా కలెక్షన్స్ లో మంచి రికార్డులను సొంతం చేసుకుంటోంది
ప్రీమియర్ బుకింగ్‌లు ఇప్పటికే $2 మిలియన్లు దాటాయి. అత్యంత వేగంగా ఈ రికార్డులను కొల్లగొట్టిన భారతీయ చలన చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా. కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడానికి సిద్ధంగా ఉంది
SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సమయంలో $1.8 మిలియన్ - $1.9 మిలియన్ల రేంజ్‌లో ఉంది
కల్కి 2898 AD ఇదే ఊపు కొనసాగితే, అది RRR $3.4 మిలియన్ మార్కును కూడా దాటవచ్చు. ప్రీమియర్ బుకింగ్‌లలో ఆల్-టైమ్ రికార్డ్‌ను సృష్టించవచ్చు