విజయ్ రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఇవే!!

విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా ఎదగడానికి కారణం తన సినిమాలలో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ అయ్యాడు. క్రేజీ సినిమాలతో విజయ్ తమిళనాడు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కొన్ని తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు విజయ్.
తెలుగులో 1996లో వచ్చిన పెళ్లి సందడి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 1998లో నినైతేన్ వందాయ్ గా ఈ సినిమాను విజయ్ రీమేక్ చేశాడు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ అయిన 'తమ్ముడు' సినిమాను.. 2001లో 'బద్రి' పేరుతో విజయ్ రీమేక్ చేశాడు
2000 సంవత్సరంలో వచ్చిన చిరునవ్వుతో సినిమాను 2002లో యూత్ అంటూ తమిళ ప్రేక్షకుల మీదకు వదిలాడు. ఇది కూడా కమర్షియల్ సక్సెస్ ను సాధించింది
వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాకు తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సినిమాను తమిళంలో 2003లో వసీగర అనే పేరుతో రీమేక్ చేశారు
మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా వచ్చిన ఒక్కడు సినిమాను.. 2003లో గిల్లీ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా తమిళనాడులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల రీరిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది
సురేందర్ రెడ్డి-నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతనొక్కడే' సినిమా 2005లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2006 లో 'ఆతి' పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష చేసింది
2006లో వచ్చిన మహేష్ బాబు పోకిరి తెలుగులో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయగా.. అదే పేరుతో 2007లో తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు
2000 సంవత్సరంలో ఆజాద్ సినిమా తెలుగులో విడుదలైంది. ఈ సినిమాలో హీరో నాగార్జున. ఇక ఈ సినిమాను ఒక దశాబ్దం తర్వాత రీమేక్ చేశాడు విజయ్. 2011లో వేలాయుధం పేరుతో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది