ఈ వారం ఓటీటీలు, థియేటర్లలో విడుదలైన పాపులర్ సినిమాలు
తెలుగు సినిమా లవర్స్ కు ఈ వారం మంచి సినిమాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో మంచి విజయాలు సాధించిన చిత్రాలు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానున్నాయి
గామి, ఓం భీమ్ బుష్, ప్రేమలు, యాత్ర-2 సినిమాలు ఈ వారం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి
ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానున్నాయి. విశ్వక్ సేన్, చాందిని చౌదరి నటించిన 'గామి' సినిమా Zee5లో ప్రసారం కానుంది
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఓం భీమ్ బుష్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతూ ఉంది
ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహా వీడియోలో ప్రసారం అవుతుంది. ప్రేమలు ఒరిజినల్ మలయాళ వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది
గామి, ఓం భీమ్ బుష్ తెలుగులో మంచి హిట్లు కాగా.. ప్రేమలు మలయాళం వెర్షన్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఇక యాత్ర-2 సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు సాగిన చరిత్రగా 'యాత్ర' సినిమా ఉండగా.. ఆ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 రూపొందింది
ఇక తెలుగులో థియేటర్లలో 'గీతాంజలి: మళ్ళీ వచ్చింది' సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది
బాలీవుడ్ లో బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ సినిమాలు విడుదలయ్యాయి.
ఈ భారీ బడ్జెట్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి