ఓట్ల లెక్కింపు ఏ సమయానికి మొదలవుతుందంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. డిసెంబర్ 3న తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఉత్కంఠ కొనసాగనుంది
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి
ప్రతి 20నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు.
ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు
సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ ఉంటుంది
తెలంగాణలో మొత్తం 3,26,02,793 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 2,32,59,256 ఓటు హక్కు వినియోగించుకున్నారు
తెలంగాణలో 79 నియోజకవర్గాల్లో 75% ఓటింగ్ జరిగింది
రాష్ట్రంలో కౌంటింగ్‌‌కు మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నానికి దాదాపుగా ఫలితాలు వెలువడనున్నాయి