అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్లు

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ ఫైట్‍కు అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది
భారత జట్టు ఆరో టైటిల్‍పై కన్నేసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఫిబ్రవరి 11న భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. తుదిపోరుకు భారత్ వరుసగా ఐదోసారి చేరింది
యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు అండర్-19 వరల్డ్ కప్ నుండే వెలుగులోకి వచ్చారు
భారత్ ఇప్పటి వరకు 2000, 2008, 2012, 2018, 2022ల్లో అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరి ఆరో టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తలపడనుంది
2000 సంవత్సరంలో మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలో భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. ఫైనల్ లో భారత జట్టు శ్రీలంక ను ఓడించింది
2008 సంవత్సరంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టును ఓడించి భారత జట్టు టైటిల్ ను సొంతం చేసుకుంది
2012.. భారత జట్టు టైటిల్ గెలిచినప్పుడు ఉన్ముక్త్ చంద్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది భారత్
2018 లో పృథ్వీ షా నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది
2022 లో భారత జట్టు టైటిల్ నెగ్గినప్పుడు యష్ ధుల్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ ను నాలుగు వికెట్ల తేడాతో భారతజట్టు ఓడించింది
ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోసారి టైటిల్ ను భారత్ సొంతం చేస్తాడో లేదో చూడాలి