బాలీవుడ్ అంటే గ్లామర్, పార్టీలు, ఆల్కహాల్‌ అనే పేరుంది. అయితే చాలా మంది సెలెబ్రిటీలు తాము మద్యం తీసుకుంటామని చెప్పలేరు

కానీ కొందరు సెలెబ్రిటీలు మాత్రం తాము మద్యపానాన్ని వదిలేశామని ధైర్యంగా చెప్పగలరు. ఇంకొంత మంది మద్యపానంతో తమ పోరాటాల గురించి మీడియాతో చెప్పుకొచ్చారు
ప్రముఖ కవి జావేద్ అక్తర్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో తాగడం మానేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2020లో, అతను తన ట్విట్టర్ ఖాతాలో జూలై 30, 1991న తాను చివరిసారిగా మద్యం సేవించినట్లు ప్రకటించారు
మనీషా కొయిరాలా.. తెలుగు వాళ్లకు ఆమె కొత్త ముఖమేదీ కాదు. తన పుస్తకం హీల్: హౌ క్యాన్సర్ గావ్ మి ఎ న్యూ లైఫ్ విడుదలైన తర్వాత తన మద్య వ్యసనాన్ని తెలిపారు. ఇదే విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు
పూజా భట్: 2017లో మద్యపానంతో తాను చేసిన పోరాటం గురించి పూజా భట్ మాట్లాడారు. డాడీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి, నాలుగేళ్ల క్రితమే తాగడం మానేసినట్లు ఫిల్మ్‌ఫేర్‌కి తెలిపింది
ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం నేను మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు, నేను దాని గురించి బహిరంగంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది
ధర్మేంద్ర.. ధర్మేంద్ర దాదాపు రెండు దశాబ్దాలుగా మద్యానికి దూరంగా ఉన్నారు. 2001లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే సమయంలో తన వ్యసనానికి స్వస్తి చెప్పాలని భావించారు. ధర్మేంద్ర సుమారు 15 సంవత్సరాల పాటు మద్యపానాన్ని వదిలిపెట్టాలని ప్రయత్నించాడు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఆల్కహాల్ వ్యసనం నుండి బయటపడడానికి పెద్ద ప్రయత్నమే చేశాడు