భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్
స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రజనీ పుట్టిన రోజు డిసెంబరు 12. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతో గ్రాండ్ గా తలైవా పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు
కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు
కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొని తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు
కన్నడలో 'కథా సంగమ' అనే చిత్రం చేశారు. బాలచందర్ దర్శకత్వంలోనే 'అంతులేని కథ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు
మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు సాధించారు
ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు
రజనీకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి
దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తెలుగు లో భారీ హిట్ ను సొంతం చేసుకొన్నాయి
చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు తెలుగులో సూపర్ కలెక్షన్స్ ను తెచ్చిపెట్టాయి