తెలుగు సినీ పరిశ్రమలో మహిళా పోలీసు ఆఫీసర్ పాత్ర అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి పేరు విజయశాంతి. కర్తవ్యం సినిమాలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అద్భుతమైన యాక్టింగ్.. ఫైట్స్ తో దుమ్ము దులిపిన విజయశాంతి. ఒక ట్రెండ్ ను అప్పట్లో సృష్టించారు
రాఖీ సినిమాలో సుహాసిని.. ఎంతో ఎమోషనల్ సినిమాలో రాఖీని పట్టుకునే పాత్రలో ఆమె నటించారు
త్రిష.. 20 సంవత్సరాలుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆమె బృంద అనే వెబ్ సిరీస్ లో పోలీసు ఆఫీసర్ గా నటించింది
యాంకరింగ్ తో భారీ పాపులారిటీని దక్కించుకున్న అనసూయ.. క్షణం సినిమాలో పోలీసు పాత్రలో అందరినీ థ్రిల్ కు గురి చేసింది
నయనతార జవాన్ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా కనిపించింది. అంతకు ముందు కూడా అంజలి ఐపీఎస్ సినిమాలో పోలీసు పాత్రలో మెప్పించింది
జ్యోతిక.. చంద్రముఖి సినిమాతో ఊహించని పాపులారిటీని దక్కించుకున్న జ్యోతిక. నాచియార్ సినిమాలో యాంగ్రీ పోలీసు విమెన్ గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది
కాజల్.. జిల్లా సినిమాలో పోలీసు ఆఫీసర్ గా కనిపించింది. ఇళయదళపతి విజయ్ తో ఈ సినిమాలో ఆడిపాడింది కాజల్. కొత్తగా వస్తున్న 'సత్యభామ' సినిమాలో కూడా పోలీసు పాత్రలో కాజల్ కనిపిస్తోంది
రష్మిక.. నేషనల్ క్రష్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు. తెలుగులో నటించిన దేవ్ దాస్ సినిమాలో పోలీసు పాత్రలో కనిపిస్తుంది
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ 'సాని కైధమ్'లో కీర్తి సురేష్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రను పోషించింది. ఈ సినిమాలో డిఫరెంట్ కీర్తి సురేష్ ను చూస్తాం