చలికాలంలో తుమ్ములు సర్వసాధారణం. అలర్జీ ఉండే వారికి.. తరచూ తుమ్ములు వేధిస్తూ ఉంటాయి
ముక్కులోని పొరల్లో అలర్జీ మొదలైతే హిస్టమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లయి.. ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోయి ఆగకుండా తుమ్ములు వస్తాయి
కొంతమంది తుమ్ములు ఆగడానికి వెంటనే మందులు మింగుతూ ఉంటారు. అలా చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలర్జీ కారణంగా వచ్చే తుమ్ములను తగ్గించడానికి చిన్న చిట్కాలు బాగా ఉపయోగపడతాయి
తుమ్మలను నివారించడంలో అల్లం ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది.అల్లంతో చేసిన టీ తాగడం వల్ల తుమ్మల నుండి ఉపశమనం లభిస్తుంది
వెల్లుల్లిలో ఎక్కువ భాగం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీటిని కొద్ది కొద్ది పరిమాణంలో రోజంతా తాగడం వల్ల తుమ్మల నుంచి ఉపశమనం పొందవచ్చు
కొద్దిగా తేనెలోకి నిమ్మరసం కలిపి తీసుకోవాల.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, నిమ్మరసంలోని విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు, జలుబు, తుమ్ములు వంటివాటిని నివారిస్తుంది
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే యాంటీ బ్యాక్టీరియల్ దగ్గు జలుబు వంటి సమస్యల నుండి దూరం చేస్తుంది.అందువల్ల ప్రతి రోజు ఆహారంలో పసుపు తీసుకోవడం ఎంతో మంచిది
విటమిన్ సి యాంటిహిస్టామైన్‌గా పని చేస్తుంది. అలర్జీ, ఇతర కారణాల వల్ల తరచుగా తుమ్ములతో బాధపడేవారు తమ ఆహారంలో విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్-సి సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉంటుంది
తుమ్ములు ఎక్కువగా వస్తుంటే మీ ముక్కును రెండు వైపులా 5 నుంచి 10 సెకన్ల పాటు మూసి ఉంచండి. మీకు ముక్కు కారటం తగ్గడమే కాకుండా.. తమ్ములు కూడా కంట్రోల్ అవుతాయి
వేడి నీటితో ఆవిరి పట్టండి. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని.. టవల్ కప్పుకుని ఆవిరిని బాగా పీల్చండి. వేడి ఆవిర్ల కారణంగా.. నాసికా భాగం క్లియర్ అవుతుంది