ఈ ఎండాకాలం మీ చర్మాన్ని సన్‌స్క్రీన్‌ తో కాపాడుకోండి ఇలా!!

ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండలకు మనం ఎలా పడితే అలా తిరగేస్తే మన చర్మం పాడవ్వడం ఖాయం
వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా మీ చర్మాన్ని ఎండ నుండి దెబ్బతినకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం
ఎక్కువ వేడి మన చర్మాన్ని తాకడం వలన.. చర్మంపై మచ్చలు, ముడతలు లాంటివి చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చర్మ క్యాన్సర్ కూడా ప్రజలను వేధిస్తూ ఉంది
ట్యాన్‌ రాకుండా.. చర్మం పాడవకుండా.. సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలోనే చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ను రాసుకుంటారు. సీజన్ ఏదైనా బయటకు వెళ్లే ముందు కచ్చితంగా సన్ స్క్రీన్ ను రాసుకోవాలని చర్మ నిపుణులు చెబుతున్నారు
సన్‌స్క్రీన్‌ క్వాలిటీని దాని spf స్థాయిని బట్టి కొలుస్తూ ఉంటారు. SPF 30 సన్‌స్క్రీన్‌ హానికరమైన యూవీ కిరణాలను 97 శాతం వరకు చర్మంలోనికి చొచ్చుకుపోకుండా కాపాడుతుంది
ఇక SPF 50 ఉన్న సన్‌స్క్రీన్ సూర్యుడి నుంచి చర్మానికి హాని కలిగించే UV కిరణాలను 98 శాతం వరకు రక్షణ కల్పిస్తాయి
సన్‌స్క్రీన్‌ రోజంతా రక్షణను అందించలేవు. కేవలం రెండు-మూడు గంటలు మాత్రమే రక్షణ ఇస్తాయి. కాబట్టి మీరు ఎండలో ఉండే సమయాన్ని బట్టి సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవలసి ఉంటుంది
మార్కెట్లో లభ్యమైతే సన్ స్క్రీన్స్ లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. వాటికి బదులు ఇంట్లోనే సన్ స్క్రీన్ ను తయారు చేసుకుని వాడితే బోలెడు స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి