కుక్కలు COVID-19ని చాలా తొందరగా గుర్తిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి
ఎంతో సులభంగా కుక్కలు కోవిడ్-19 మనుషుల్లో ఉందో, లేదో గుర్తిస్తున్నాయని అధికారులు తెలిపారు
భవిష్యత్తులో వచ్చే మహమ్మారిలపై పోరాటానికి కుక్కలు కూడా సహాయం చేయనున్నాయని అభిప్రాయపడుతూ ఉన్నారు నిపుణులు
డి గ్రుయిటర్స్ జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురించిన సమీక్షలో ఈ విషయం బయటపడింది
RT-PCR వంటి సాంప్రదాయిక COVID-19 పరీక్షల కంటే కుక్కలు జస్ట్ అలా స్నిఫ్ చేసి మహమ్మారిని కనుక్కుంటూ ఉన్నాయి
శిక్షణ పొందిన కుక్కలు కొన్ని క్యాన్సర్లు, పార్కిన్సన్స్, మధుమేహం ఉన్న రోగులను గుర్తించాయి.. ఇప్పుడు కోవిడ్-19 విషయంలో కూడా కుక్కల సక్సెస్ రేట్ సూపర్ అని అంటున్నారు
19 విభిన్న కుక్క జాతులను ఉపయోగించి 30 కంటే ఎక్కువ దేశాల నుండి 400 మంది శాస్త్రవేత్తలు 31,000 నమూనాలను ఉపయోగించి ఈ అధ్యయనాలు జరిగాయి
కుక్కలు చెమట, లాలాజలం, మూత్రానికి సంబంధించిన శాంపిల్స్ ను బట్టి రోగాలను పసిగట్టాయి
కుక్కలకు 300 మిలియన్ల వరకు ఘ్రాణ కణాలు ఉండడంతో అవి ఎంతో సులువుగా మనిషిలో ఉన్న రోగాలని కనిపెట్టేయగలుగుతూ ఉంటాయి. కుక్కలు తమ ఓనర్లను కూడా వాసనతో కనిపెట్టేయగలవు, ఎక్కడికైనా వాసన ద్వారా వెతుక్కుంటూ వెళ్లగలవు