సంక్రాంతి ఎప్పుడు? ఏమేమి చేయాలి?

మకర సంక్రాంతి ఈ ఏడాది జనవరి 14 లేదా 15వ తేదీన జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది
చాంద్రమానం ప్రకారం ఏడాదిలో దాదాపు అన్ని పండగలు జరుపుకుంటాం. కానీ సౌరమానం ఆధారంగా సంక్రాంతిని జరుపుకుంటాం
సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర ఘడియలనే మకర సంక్రాంతిగా అంతా పరిగణిస్తారు
ఈ ఏడాది 2026, జనవరి 14వ తేదీన పవిత్ర స్నానాలు, దానధర్మాలు, సూర్య ఆరాధన చేయాలని పండితులు తెలిపారు
సూర్యుడు సాయంత్రం చాలా ఆలస్యంగా లేదా సూర్యాస్తమయం తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో పండగ మరుసటి రోజు జరుపుకుంటారు
ఈ ఏడాది జనవరి 14వ తేదీ మధ్యాహ్నమే ఈ మార్పు జరుగుతుంది. దాంతో ఈ పండగను జనవరి 14వ తేదీనే జరుపుకోనున్నారు
దీని ప్రకారం 2026లో మకర సంక్రాంతి వేడుకలకు జనవరి 14వ తేదీగా నిర్ణయించారు. మధ్యాహ్నం 3.13 గంటలకు సంక్రాంతి ముహూర్తం వస్తుంది