ఆనందంతో పరవశించిపోతున్న సమంత

IMDb ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించిన టాప్ 100 భారతీయ తారల జాబితాను విడుదల చేసింది
ఈ లిస్టులో సమంత కూడా నిలవడం విశేషం. టాప్ 15లో నిలిచిన సౌత్ ఇండియన్ యాక్టర్ సమంత రూత్ ప్రభు మాత్రమే.. దీనిపై ఆమె స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది
ఈ అరుదైన ఘనతను సాధించడానికి కారణమైన తన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకులకు సమంత కృతజ్ఞతలు తెలిపింది
ప్రేక్షకులు తనపై చూపిన అపురూపమైన ప్రేమ, విశ్వాసం పట్ల వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపింది. ఈ గౌరవాన్ని అందించిన IMDB కి కూడా సమంత థాంక్స్ చెప్పింది
ఈ జాబితాలో సమంత 13 ర్యాంక్‌ను సాధించింది. కరీనా కపూర్ ఖాన్, త్రిప్తి డిమ్రీ వరుసగా 14, 15 స్థానాల్లో ఉన్నారు
సమంత గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. అటు ఆమె ప్రొఫెషనల్ విషయంలోనూ.. పర్సనల్ అంశాలలోనూ ప్రజలు ఆమె గురించి తెలుసుకోవాలని భావించారు
ముఖ్యంగా సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేయడం, ఆమె విడాకులు తీసుకోవడం, అనారోగ్యం పాలవ్వడం లాంటి ఎన్నో ఘటనలు ఆమె జీవితంలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్నాయి
సమంత చివరిసారిగా 2023లో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషీ' చిత్రంలో నటించింది. మయోసిటిస్ నిర్ధారణ కారణంగా ఆమె యాక్టింగ్ నుండి విరామం తీసుకుంది
ఆమె త్వరలో రాజ్ & డికె వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' లో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ప్రియాంక చోప్రా, జోష్ అప్పెల్‌బామ్ లు నటించిన అమెరికన్ సిరీస్ కు భారతీయ వెర్షన్ ఇది
ఆమె ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. అందులో భాగంగా తొలి చిత్రం బంగారంలో నటిస్తూ ఉంది