బికినీ బాంబ్ పేల్చిన సమంత

సమంతా రూత్ ప్రభు మలేషియా హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే!! ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ వస్తోంది
అనారోగ్య కారణాలతో సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సమంత త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చెప్పింది
తాజాగా బికినీలో ఉన్న ఫోటోలను ఆమె షేర్‌ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది
ప్రయాణాలను ఇష్టపడే సమంత రూత్ ప్రభు మలేషియాలో తీసుకున్న కొన్ని అద్భుతమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా సమంత స్విమ్ సూట్ ధరించి ఫోటోలను షేర్ చేసింది
మొదటి చిత్రంలో, సమంత నీటిలో పైకి చూస్తూ కనిపించింది. మరొక సెట్ చిత్రాలలో.. సమంత ఈత కొడుతూ కెమెరాను చూస్తూ నవ్వుతూ కనిపిస్తుంది
మలేషియాలో ఉన్న సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
సమంత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ వస్తోంది. ఆమె మరింత ఫిట్‌గా ఉంటూ వస్తోంది. ఆమె మెటబాలిక్‌ ఏజ్‌ 23 మాత్రమే అని.. బరువు 50 కేజీలు మాత్రమే అని ఒక స్లిప్‌ కూడా పోస్ట్‌ చేసింది
గత ఏడాది జూలైలో, సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కనీసం ఒక సంవత్సరం పాటు తన ప్రాజెక్ట్‌లకు విరామం ప్రకటించింది
మైయోసిటిస్‌కు USలో చికిత్స తీసుకుంది. పలు దేశాలను తిరుగుతూ సెల్ఫ్ లవ్ ను సమంత ప్రమోట్ చేస్తూ వస్తోంది. తాను నటించడం తిరిగి ప్రారంభిస్తానని ఆమె ఇటీవలే వెల్లడించింది
సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో ఖుషిలో కనిపించింది. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైంది. రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్.. ఇండియన్ వెర్షన్ లో సమంత కనిపించబోతోంది