ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో రష్మిక మందన్నా

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన వార్షిక 30 అండర్ 30 జాబితాను ప్రకటించింది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది “ట్రయల్‌బ్లేజర్స్ అండ్ డిస్ట్రప్టర్స్”ను ఎంపిక చేసింది.
ఎంటర్టైన్మెంట్ రంగం నుండి ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందన్న, డాట్ ఉన్నారు.
27 ఏళ్ల రష్మిక మందన్నాకు దేశ వ్యాప్తంగా భారీ పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి
తమిళంలో విజయ్ తో కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన 'వారిసు'లో నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది
సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శంతను బాగ్చి డైరెక్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో నటించింది. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే విడుదలైంది
ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా యానిమల్ లో కథానాయికగా నటించింది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది
రాధికా మదన్ 28 ఏళ్ల నటి. హిందీ చిత్రాలలో నటిస్తోంది. గత ఏడాది ఆమె మూడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్ సినిమాల్లో మంచి పేరు సంపాదించిన రాధికా మదన్ ఇప్పుడు ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో చోటు సంపాదించింది
గాయని, సంగీతకారిణి అయిన 25 ఏళ్ల అదితి కూడా ఈ లిస్టులో చోటు సంపాదించింది. ఆమె స్టేజ్ పేరు డాట్. ది ఆర్చీస్ లో ఆమె ఎథెల్ పాత్రలో నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది