ఒపెన్‌హైమర్ జులై 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది

హాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన 12వ చిత్రం ఇది. భారీ అంచనాలు ఉన్నాయి
అమెరికన్ ప్రోమేతియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె రాబర్ట్ ఒపెన్‌హైమర్.. అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త
హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు
నోలాన్ దర్శకత్వం వహించిన సినిమాలలో.. ఒపెన్‌హైమర్ సినిమా నిడివి ఎక్కువ. అతడు దర్శకత్వం వహించిన ఇంటర్‌స్టెల్లార్ నిడివి 2 గంటల 49 నిమిషాలు ఉండగా.. ఈ సినిమా 3 గంటలకు పైగా రన్‌టైమ్‌ను కలిగి ఉంది
ఈ సినిమాకు అత్యాధునిక కెమెరాలను ఉపయోగించారు. ముఖ్యంగా ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా చూడడానికి సినీ అభిమానులకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు
నోలన్ ఇంతకు ముందు తీసిన చిత్రాలు డంకిర్క్, టెనెట్ ల లాగే ఒపెన్‌హైమర్ పూర్తిగా హై రెజల్యూషన్ కెమెరాలతో తీశారు
ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ కెమెరాలైన IMAX 65mm, Panavision 65mm కెమెరాలతో సినిమాను తెరకెక్కించారంటే బిగ్ స్క్రీన్ మీద బ్లాస్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు