స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు - నిర్మాత జాకీ భగ్నానీ భార్యభర్తలు అయ్యారు. సుమారు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫిబ్రవరి 21, 2024 పెళ్లాడారు
ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు
పెళ్లికి పింక్ పీచ్ కలర్ లెహెంగాను, వజ్రాభరణాలను ధరించి కనిపించింది రకుల్. క్రీమ్ గోల్డెన్ షెర్వానీ, భారీ నెక్లెస్‍ను జాకీ భగ్నానీ ధరించారు
తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు వారు పెళ్లి బంధంతో దంపతులయ్యారు
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు
ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది
ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి