రక్షా బంధన్ తోబుట్టువుల మధ్య ప్రేమ బంధాన్ని సూచిస్తుంది

ఈ సంవత్సరం రెండు రోజులు రాఖీ పండుగ ఉండొచ్చని అంటున్నారు. శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున ఈ పండగను జరుపుకుంటాం
ఈ రోజున సోదరి, సోదరుడి చేతికి రాఖీ కట్టి వాళ్ల ఆనందాన్ని, దీర్ఘాయుష్షును కోరుకుంటుంది. సోదరుడు సోదరికి రక్షగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తారు
ఈ ఏడాది పండగ ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో ఆగష్టు 30 వ తేదీనా, లేదా 31 వ తేదీనా అనే సందేహం ఉంది
ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గడియలు ఆగష్టు 30 ఉదయం 10:59 నుండి ప్రారంభమై ఆగష్టు 31 ఉదయం 7:05 వరకు ఉన్నాయి
అయితే ఆగష్టు 30వ తేదీ ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉందని పంచాంగ కర్తలు చెబుతున్నారు
ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదని.. అందుకే ఈ భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శ్రేయస్కరమని చెబుతున్నారు
30వ తేదీ రాత్రి 9.02 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు రక్షాబంధనం కట్టవచ్చని సూచిస్తున్నారు
లంకాధిపతి రావణాసురుడు సోదరి భద్ర. ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది
పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు ఉన్నారు
పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అంటారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు