గతేడాదికంటే ఈ ఏడాది భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు

ఎండలో అధికంగా తిరిగేవారు వదులుగా ఉండే దుస్తులు, లేతరంగుల దుస్తులు ధరించడం మంచిది
రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి
పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం, నిమ్మరసం వంటివి తీసుకోవాలి
నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలి
రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్)లో పెట్టిన నీటి కంటే మట్టికుండలో ఉన్న నీటిని తాగడం ఉత్తమం
బయటికి వెళ్లేటపుడు కళ్లద్దాలు, సన్ స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది
వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి