ముంబై కల్కి ఈవెంట్ లో ప్రభాస్ ఫోటోలు

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'కల్కి 2898 AD'. ఈ సినిమా నిర్మాతలు ముంబైలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు
ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌ హాజరయ్యారు. బ్లాక్ కలర్ షర్ట్, జీన్స్ ప్యాంట్ తో ప్రభాస్ లుక్స్ అదరగొట్టాడు
ఈ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరించిన రానా దగ్గుబాటి కొన్ని ప్రశ్నలు వేశాడు. తాను అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల సినిమాలు చూస్తూ పెరిగిన వ్యక్తినని.. కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడు ప్రభాస్
గొప్ప లెజెండ్స్‌తో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అశ్వినీ దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు తెలిపాడు ప్రభాస్
సౌత్, నార్త్, తెలుగు, తమిళ్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ చూశామని ప్రభాస్ తెలిపాడు. మేము ప్రతి పొడుగు వ్యక్తిని అమితాబ్ బచ్చన్ అని పిలుస్తాము. సౌత్‌లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు అమితాబ్ బచ్చన్ అని ప్రభాస్ పంచుకున్నాడు
కమల్ హాసన్ 'సాగర సంగమం' సినిమా వచ్చినప్పుడు, నేను మా అమ్మను ఆయన డ్రెస్ కావాలని అడిగానని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. ఈ రోజు వారితో కలిసి పని చేయడం నమ్మశక్యం కాని విషయమని చెప్పుకొచ్చాడు ప్రభాస్
ఈ ఈవెంట్ లో రెండో ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ రెండో ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయని అభిమానులు చెబుతున్నారు
కల్కి 2898 AD, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ నిర్మించింది. జూన్ 27 న బహుళ భాషలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. 600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం