మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం 'కల్కి 2898 AD'

అంతకు ముందు 'ప్రాజెక్ట్ K' అని వర్కింగ్ టైటిల్ తో మంచి పాపులారిటీని దక్కించుకుంది
ఈ సినిమా టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను తెచ్చింది
యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి
కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో మళ్లీ వస్తారని భావిస్తూ ఉంటారు. ఇదే లైన్ తో నాగ్ అశ్విన్ 'కల్కి 2898AD' సినిమాని రూపొందిస్తున్నారు
కల్కి అవతారంలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడు
ప్రభాస్ మాట్లాడుతూ ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ని నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని అన్నాడు
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు
సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే నటిస్తుంది. అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు
సంతోష్ నారాయణన్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది