డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ప్రశంసల వర్షం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. చెన్నైలోని వెల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు
ఏప్రిల్ 13న జరిగిన యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
రామ్ చరణ్‌కు చెన్నై విశ్వవిద్యాలయం అధికారికంగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ గా మారారని టాలీవుడ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు
సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని వెల్స్ యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది
సినీ రంగంలో రామ్ చరణ్ విజయాలు స్ఫూర్తిదాయకం. చిత్రపరిశ్రమకు ఆయన సేవలు అపురూపం. సామాజిక సేవ పట్ల ఆయన నిబద్ధత అచంచలమని వెల్స్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రశంసించింది
రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా, గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణమని ఎక్స్ లో చిరు పోస్ట్ చేశారు
బాబాయ్ నాగబాబు స్పందిస్తూ.. చిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తూ ఉన్నానన్నారు