డిస్నీ ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న కియారా అద్వానీ!!

బాలీవుడ్ నటి కియారా అద్వానీ కొద్దిరోజుల కిందట విశాఖపట్నంలో సందడి చేసిన సంగతి తెలిసిందే
గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తూ ఉంది. అంతకు ముందు వీరిద్దరూ కలిసి 'వినయ విధేయ రామ' సినిమాలో కలిసి నటించారు
తాజాగా కియారా అద్వానీ ఒక అవార్డ్ ఫంక్షన్‌కి వచ్చింది. లేత నీలం రంగు గౌనులో ఆమె కనిపించింది. ఆమె లుక్ మీకు డిస్నీ క్యారెక్టర్ ప్రిన్సెస్ జాస్మిన్‌ని గుర్తు చేస్తుంది
ఈ ఈవెంట్ కు సంబంధించి కియారాను లక్ష్మీ లెహర్ స్టైల్ చేసింది
‘డాన్ 3’లో రణవీర్ సింగ్‌తో పాటు కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తుంది. షారూఖ్ ఖాన్ నటించిన చివరి ‘డాన్’ చిత్రంలో ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ లో కనిపించింది. ప్రియాంక స్థానంలో కియారాను తీసుకున్నారు
షారుఖ్ ఖాన్ లేకుండా ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న 'డాన్ 3' ఎలా ఉండబోతోందోననే అనుమానాలు కూడా అభిమానులను వెంటాడుతూ ఉన్నాయి
కియారా చివరిగా కార్తీక్ ఆర్యన్ నటించిన 'సత్యప్రేమ్ కి కథ'లో కనిపించింది. ఈ చిత్రంతో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది