పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రియాంక చోప్రా కజిన్, నటి మీరా చోప్రా వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను పెళ్లి చేసుకుంది
మార్చి 12 న జైపూర్‌లో వివాహ వేడుక జరిగింది. కేవలం సన్నిహితులు, దగ్గరి బంధువుల మధ్య ఈ పెళ్లి జరిగింది
మీరా చోప్రా ఎరుపు రంగు లెహంగాలో కనిపించింది. వరుడు రక్షిత్ ఐవరీ షేర్వానీని ఎంచుకున్నాడు
జైపూర్-ఢిల్లీ హైవేలోని బ్యూనా విస్టా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. రెండు రోజుల పాటూ ఈ పెళ్లి వేడుకలు సాగాయి
మార్చి 11న మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు జరిగాయి. సందీప్ సింగ్, ఆనంద్ పండిత్, అర్జన్ బజ్వా, గౌరవ్ చోప్రా లాంటి పలువురు సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు
"ఆనందాలు, గిల్లికజ్జాలు, త్యాగాలు, నవ్వులు, కన్నీళ్లు.. ఇకపై అన్నీ నీతోనే. ప్రతి జన్మకు నువ్వే కావాలి" అంటూ మీరా చోప్రా పోస్ట్ పెట్టింది
తెలుగులో బంగారం, వాన, మారో సినిమాల్లో నటించింది మీరా చోప్రా
ప్రస్తుతం కొన్ని హిందీ సినిమాలలోనూ, ఓటీటీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంది