ఇక పవర్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్.. మంత్రిగా బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు
వేద మంత్రోచ్ఛారణలతో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. దేవుని పటాలకు పూజలు చేసి హారతి ఇచ్చిన అనంతరం తన కుర్చీలో కూర్చున్నారు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు.
పవన్‌ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు జనసేన నేతలు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమీక్షా సమావేశాల కోసం సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు
వెంటనే రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరు ఫైలు పైనా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలు పైనా ఆయన సంతకాలు చేశారు
పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్‌పై సంతకాలను తన అభిమాని ఇచ్చిన పెన్నుతో చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నుంచి బయల్దేరి అమరావతిలో ఉన్న సచివాలయానికి బయల్దేరారు
ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్ వెళుతుండగా.. ఓ అభిమాని ఓ పెన్నును గిఫ్ట్‌గా అందించారు. ఈ పెన్‌ను జాగ్రత్తగా తీసకుని జేబులో పెట్టుకున్నారు
మరో ఫైలుపై పవన్ కళ్యాణ్ వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు పవన్ కళ్యాణ్