రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ఫ్లాప్స్ ను ఎదుర్కొంటూ ఉన్నాడు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న ప్రభాస్ హ్యాకింగ్ కు కూడా బలయ్యాడు.

ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో ఈ వీడియోఉంది.
అభిమానులు గుర్తించి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లుగా గుర్తించి, ట్వీట్లు చేశారు. రంగంలోకి దిగిన ప్రభాస్ సాంకేతిక టీమ్ సమస్యను పరిష్కరించింది.
పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభాస్ కేవలం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తూ వస్తోంది. ప్రభాస్ సినిమా ఆదిపురుష్ పై కూడా వివేక్ అగ్నిహోత్రి విమర్శలు చేశారని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి.
ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ చేశాడు, అదే టైమ్ లో ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ చేశాను. హిట్ కొట్టాను. ప్రభాస్ సలార్ రిలీజ్ చేసే టైమ్ కు వ్యాక్సిన్ వార్ సినిమా రెడీ చేస్తున్నానని వివేక్ అగ్నిహోత్రి అన్నట్లుగా పోస్టులు పెట్టారు
ఇక ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అవ్వగా.. వేల సంవత్సరాలుగా పురాణాలు అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే వాటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలని వివేక్ అగ్నిహోత్రి అన్నట్లుగా కూడా చెప్పారు
కొందరు స్క్రీన్ పైకి వస్తే నిజంగా దేవుళ్లు అయిపోతారా. రోజూ రాత్రి ఇంటికి తాగొచ్చి, తెల్లారి నేను దేవుడ్ని అంటే నమ్మడానికి ప్రేక్షకులు పిచ్చోళ్లా.. అని కూడా వివేక్ అగ్నిహోత్రి చెప్పిన వ్యాఖ్యలు అంటూ ప్రచారం నడిచింది
తాజాగా ఈ వార్తలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. తాను అనని మాటలను తనకు లింక్ చేశారని చెప్పుకొచ్చారు. తనకు ప్రభాస్ అంటే ఎంతో గౌరవమని అన్నారు.. ప్రభాస్ ఒక పెద్ద స్టార్. చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసే నాకు ఆయనతో పోలిక ఎందుకు పెట్టుకుంటానన్నారు.
అలాంటి దిగజారుడు పనులు నేను చేయను. సలార్ తో పాటు నా సినిమా రిలీజ్ అవడం అనేది కేవలం కాకతాళీయం మాత్రమే.. కావాలని ప్లాన్ చేసింది కాదు. అయినా ఇలాంటి రూమర్స్ ఎవరు ఎందుకు క్రియేట్ చేస్తారో అర్థం కావట్లేదని ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి