నెట్ ఫ్లిక్స్ పండగ: భారీ చిత్రాలను ఇకపై నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ.. పలు సినిమాలను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి తీసుకుని వస్తున్నట్లు ఇటీవలే తెలిపింది.
ఆ లిస్టులో సలార్ పార్ట్ 1, దేవర పార్ట్ 1, పుష్ప-2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను భారీ ధరతో కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్
ఇక సలార్‌ సినిమాను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది
‘పుష్ప 2′, ‘దేవర’ రెండు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలు. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న నటించిన కమర్షియల్ సక్సెస్ ‘పుష్ప’కి సీక్వెల్ ఆగస్ట్ 15ని థియేట్రికల్ రిలీజ్ డేట్‌గా నిర్ణయించారు. థియేట్రికల్ రన్ తర్వాత, ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.
‘దేవర: పార్ట్ 1’ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన తారలుగా నటించారు. ఇది ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇది థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.
‘డీజే టిల్లు’ అభిమానులు కూడా నెట్‌ఫ్లిక్స్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో ‘టిల్లు స్క్వేర్’ సందడి చేయనుంది. థియేటర్ రన్ పూర్తయ్యాక ప్రజలు దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
నందమూరి బాలకృష్ణ ‘NBK 109’, విజయ్ దేవరకొండ ‘#VD12’ వంటి సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనున్నాయి.