అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు

సినిమా టికెట్లు కేవలం రూ.99కే లభించనున్నాయి. సినిమా లవర్స్ కు ఇదొక గుడ్ న్యూస్
మల్టీప్లెక్స్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలో 4 వేల సినిమా హాళ్లలో 99 రూపాయలకే సినిమాలను చూడొచ్చు
PVR, INOX, Cinepolis సహా పలు మల్టీప్లెక్స్ కంపెనీలు జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా టికెట్ల ధరను రూ.99గా నిర్ణయించాయి
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది
Paytm, Bookmyshow.. సదరు మల్టీప్లెక్స్ యాప్స్ నుంచి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు
అంతేకాకుండా ఇంకా కొన్ని ఆఫర్లు, ప్రత్యేక క్యాష్ బ్యాక్‌లను పొందొచ్చు. ఈ ఆఫర్ IMAX, 4DX, రీక్లైనర్ సీట్లకు వర్తించదు
రూ.99 టికెట్లో కన్వీనియన్స్ ఫీజు, GST ఉండదు. ఆఫ్‌లైన్ టికెట్లకు కూడా కన్వీనియన్స్ ఫీజు అవసరం లేదు
గత ఏడాది 2022 సంవత్సరంలో అక్టోబర్ 13వ తేదీన టికెట్ ధరను రూ.99కే విక్రయించారు. సినిమాలకు తిరిగి ప్రేక్షకులను రప్పించడానికి ఇదొక అవకాశంగా థియేటర్ల యజమానులు భావిస్తూ ఉన్నారు