నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీర సింహా రెడ్డి హిట్స్ తర్వాత బాలయ్య హీరోగా వచ్చిన సినిమా.

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మంచి కుటుంబ కథా చిత్రాన్ని బాలయ్య సినీ అభిమానులకు అందించాడు
కథ పరంగా నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్‌ జైల్లో ఖైదీగా ఉంటాడు. జైలర్‌ శ్రీకాంత్‌ భగవంత్‌ కేసరికి సహాయం చేసిన కారణంగా సస్పెండ్‌ అవుతాడు. ఆ తర్వాత సత్ప్రవర్తన కారణంగా భగవంత్‌ కేసరి బయటకు వస్తాడు
జైలర్‌ శ్రీకాంత్‌ మరణంతో అతని కూతురు విజయలక్ష్మి(శ్రీలీల) బాధ్యతను భగవంత్‌ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జి పాపను ఇండియన్‌ ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు
వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) విజయ లక్ష్మిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు భగవంత్‌ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్‌ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? తెలియాలంటే థియేటర్స్‌లో ‘భగవంత్‌ కేసరి’ చూడాల్సిందే
ఫస్టాఫ్‌ కాస్త స్లోగా అనిపించినా ఇంటర్వెల్‌, సెకండాఫ్‌ చాలా అబాగుంది. ద్వితీయార్థంలో మాస్ మెచ్చే ఎలిమెంట్స్‌ ఉంటాయి
అనిల్‌ రావిపూడి కామెడీ టచ్‌తో బస్‌లో బాలయ్య చేసే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది
స్కూల్‌లో బాలయ్య ఇచ్చే స్పీచ్‌ సందేశాత్మకంగా ఉంటుంది
విలన్‌ ఇంటికి వెళ్లి హీరో వార్నింగ్‌ ఇచ్చే సీన్‌.. క్లైమాక్స్‌లో శ్రీలీల చేసే యాక్షన్‌ సీన్‌ థ్రిలింగ్‌గా అనిపిస్తుంది
తమన్‌ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు
ఓవరాల్ గా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది.
రేటింగ్ 3/5