ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో మెరిసిన మృణాల్ ఠాకూర్

విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది
ఈ సినిమా ప్రమోషన్స్ లో దూకుడును పెంచారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు
ఈ సినిమాలో తాను చేసిన గోవర్ధన్ పాత్ర తన ఒరిజినాలిటీకి పూర్తిగా వ్యతిరేకమని విజయ్ చెప్పుకొచ్చాడు
ఫ్యామిలీ స్టార్‌లో సింధు క్యారెక్టర్‌లో మృణాల్ నటించింది. పరశురామ్ భార్య 'అర్చన అక్క' ఈ పాత్రకు ప్రేరణ అని మృణాల్ తెలిపింది
విజయ్ దేవరకొండ పాత్ర ఫ్యామిలీ స్టార్‌కి వెన్నెముక అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. “గతంలో గీత గోవిందంలోనూ పరశురాంతో కలిసి పనిచేశాను. సినిమా జనాలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని ఆయన అన్నారు
సోమవారం ప్రెస్ మీట్ కోసం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సంప్రదాయ దుస్తులలో వచ్చారు. విజయ్, మృణాల్ హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ప్రమోషన్‌లను ప్రారంభించారు. నటీనటులు తెల్లటి దుస్తులు ధరించి, అభిమానులతో సంభాషిస్తూ, హొలీ ఆడుకున్నారు
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో మృణాల్ ఠాకూర్ గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది టాలీవుడ్ లో. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో కూడా మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు
మృణాల్ ఠాకూర్ కు తెలుగులో వరుస ఆఫర్‌లు వచ్చినప్పటికీ.. కొత్త తెలుగు చిత్రాలకు ప్రస్తుతానికి అయితే సంతకం చేయకుండా ఉంది. "తెలుగులో కొన్ని ఆఫర్లు ఉన్నాయి, కానీ ఆమె కమిట్ అవ్వడం లేదు," అని ఒక మూలం తెలిపింది
మృణాల్ ఠాకూర్ ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో ఒక పెద్ద చిత్రానికి సంతకం చేసిందని అంటున్నారు. అది అయ్యాక మళ్లీ టాలీవుడ్ మీద మృణాల్ దృష్టి పెట్టే అవకాశం ఉంది