విజయ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయినవి ఇవే!!

పూవే ఉనక్కాగ.. 1996 లో వచ్చిన ఈ సినిమాను.. 1997లో శుభాకాంక్షలు గా రీమేక్ చేశారు.
జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు
లవ్ టుడే.. ను 1998లో సుస్వాగతం పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు మొదటి కమర్షియల్ సక్సెస్. తెలుగులో క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాలలో సుస్వాగతం ఒకటి
1997లో 'వన్స్ మోర్' సినిమాతో విజయ్ హిట్ ను అందుకోగా.. 'డ్యాడీ డ్యాడీ' సినిమాను ఏఎన్ఆర్ 1998లో రీమేక్ చేశారు. ఇది అక్కినేని నాగేశ్వర రావు కెరీర్ లో 250వ సినిమా
1998లో ప్రియముదన్ అంటూ విజయ్ సినిమా తీశారు. ఈ సినిమాను 1999లో 'ప్రేమించే మనసు' గా రీమేక్ చేశారు. వడ్డే నవీన్, కీర్తి రెడ్డి లు లీడ్ రోల్ లో చేశారు. ఈ సినిమాలో శ్రీహరి, రవితేజలు కూడా కీలక పాత్రల్లో నటించారు
విజయ్ 1999లో తుల్లాద మనముమ్ తుల్లుమ్ అనే సినిమా సెన్సేషన్ హిట్ అయ్యింది. ఈ సినిమాను తెలుగులో 'నువ్వు వస్తావని' గా రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులో ఓ క్లాసిక్ అయింది
2003లో తిరుమలై సినిమా విడుదలై కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాను తెలుగులో 2004లో గౌరీ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించారు
2005లో తిరుప్పాచ్చి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్. ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ అన్నవరం పేరుతో రీమేక్ చేశాడు. అన్నా-చెల్లెళ్ళ అనుబంధంతో వచ్చిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ హిట్ గా నిలిచింది
2005లో శివకాశి సినిమాతో తమిళప్రేక్షకులను విజయ్ అలరించాడు. 2007లో ఈ సినిమాను కళ్యాణ్ రామ్ విజయ దశమిగా రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది
2014లో కత్తి సినిమా తమిళనాడులో విజయ్ స్టార్డమ్ ను ఊహించని ఎత్తుకు తీసుకుని వెళ్లగా.. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేశారు. చిరంజీవి కెరీర్ లో ఇది 150వ సినిమా