ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న టాప్ సినిమాలు, సిరీస్ లు ఇవే
ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు సిరీస్ లు సందడి చేయనున్నాయి. రెండు మూడు వారాల క్రితం థియేటర్లలో విడుదలైన సినిమాలు ఈ వారం ఓటీటీకి క్యూ కడుతున్నాయి
ఆహా తెలుగులో 'పారిజాత పర్వం' సినిమా విడుదలైంది. కిడ్నాప్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ కామెడీ సినిమా ఇది. ఇందులో సునీల్, శ్రద్ధా దాస్ కీలక పాత్రలు పోషించారు
ఈటీవీ విన్ లో రష్ సిరీస్ జూన్ 13 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా జూన్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది
విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి కీలక పాత్రలు పోషించిన సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి విడుదల కాబోతూ ఉంది. థియేటర్లలో మొదటి వారంలో మంచి కలెక్షన్స్ సాధించిన సినిమా రెండో వారంలో పుంజుకోలేకపోయింది
డిస్నీ ప్లస్ లో యక్షిణి వెబ్ సిరీస్ జూన్ 14 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి ఈ వెబ్ సిరీస్ లో భాగంగా ఉన్నారు
బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా ఈ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సిరీస్‌కి తెలుగు, తమిళ భాషల్లో మంచి బజ్ ఉంది. యక్షిణిని మరాఠీ, బెంగాలీలో కూడా ప్రసారం చేయనున్నారు
జీ5 లో 'పరువు' వెబ్ సిరీస్ జూన్ 14 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, నాగబాబు, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది
పవన్ సాదినేని నేతృత్వంలో ఈ సిరీస్‍కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కు మంచి బజ్ అయితే ఉంది