వేడి నీటిని త్రాగడం చాలా మంచిది. టీలు, సూప్‌లను కూడా తీసుకోవాలి. ఈ పానీయాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకునే రీహైడ్రేటింగ్ చేస్తాయి. ఈ సీజన్ లో బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం.

రేగు, చెర్రీస్, బొప్పాయి, యాపిల్స్, దానిమ్మ వంటి సీజనల్ పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్లు ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.
వానాకాలం అంటే పొట్లకాయ, కాకరకాయ, బూడిద పొట్లకాయ, బెండకాయ, దోసకాయలు, టమోటాలు, బీన్స్, ఓక్రా, ముల్లంగి వంటివి పుష్కలంగా లభిస్తాయి. మీ రెగ్యులర్ డైట్ ప్లాన్‌లో ఈ కూరగాయలను జోడించండి.
వర్షాకాలంలో కూరగాయలను పచ్చిగా తినకపోవడమే ఉత్తమం. ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణం వల్ల కూరగాయలపై అధిక సంఖ్యలో బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పచ్చిగా తింటే.. ఇన్‌ఫెక్షన్ల బారిన పడతాయి.
మనం పచ్చిగా తినే క్యారెట్, టమాటా, బీట్‌రూట్.. తదితర కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు, మూలికలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్‌ తీసుకోవాలి
ఇమ్యూనిటీని పెంచే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి
సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను తీసుకోవాలి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తింటే కడుపు ఆరోగ్యంగా ఉంటుంది