మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది

అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు పడ్డాయి
కొంత మంది సినిమా బాగుందని అంటుంటే.. ఇంకొంత మంది మాత్రం చిరు ఈ సినిమాను సెలెక్ట్ చేసుకుని తప్పు చేశారంటున్నారు
పాత కథే అని.. ఇందులో కొత్తగా ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు
అక్కడక్కడా కొంచెం కామెడీ వర్కౌట్ అయ్యింది తప్పితే.. మిగతా అంతా చూడడానికి విసుగు తెప్పించిందని నెటిజన్లు అంటున్నారు
సెంటిమెంట్‌తో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ బాగున్నాయని ఇంకొందరు చెబుతున్నారు
డీసెంట్ హిట్ అని.. బాస్ లుక్స్, బీజీఎం పర్వాలేదని అంటున్నారు
చిరు లుక్స్, కీర్తి సురేష్ అద్భుతంగా ఉన్నారు.. కానీ మిగతా వారు వేస్ట్ అన్నట్టు పోస్టు పెట్టారు
ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయని.. ప్రీ క్లైమాక్స్ సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెబుతున్నారు
ఒరిజినల్ లో మార్పులు అని అంటున్నారు కానీ.. కామెడీ సీన్స్ తప్ప మిగిలినవి పెద్దగా మార్చలేదని పెదవి విరుస్తూ ఉన్నారు