ఒక కుటుంబంలో ఒకే రోజు ఇద్దరిది పుట్టినరోజు అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాంటిది ఒకే కుటుంబంలో 9 మందికి ఒకే రోజు పుట్టినరోజు అంటే కాస్త వెరైటీ అని అంటూ ఉంటారు
ఒక కుటుంబంలో 9 మంది పుట్టినరోజులు ఒకే రోజు వచ్చాయి. భార్య, భర్త.. వారి ఏడుగురు పిల్లలు ఒకే తేదీన పుట్టారు
వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. కానీ నెల, తేదీ మాత్రం ఒకే రోజు వచ్చింది. దీంతో ఈ కుటుంబం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది
ఇంతకూ ఏ దేశంలో జరిగిందనే కదా మీ డౌట్.. పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ దంపతులు వివాహ బంధంతో ఒక్కటైన రోజు కూడా అదే రోజే..!
పాకిస్థాన్‌లోని లర్కానాకు చెందిన అమీర్ అలీ కుటుంబం ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది
అమీర్ అలీతో పాటు ఆయన భార్య ఖుదేజా .. వారి ఏడుగురు పిల్లలు ఒకే తేదీన జన్మించారు. అమీర్ - ఖుదేజా దంపతుల ఆ ఏడుగురు సంతానం వయసు 19 ఏళ్ల నుంచి 30 వరకు ఉంది
వారికి సంతానానికి సంబంధించి.. ఒకే తేదీ కోసం వారి డెలివరీని ముందుకు గానీ, వెనక్కి గానీ మార్చలేదని స్పష్టం చేశారు. ఈ అరుదైన ఘనత సాధించిన కుటుంబం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడంతో నిర్వాహకులు.. వారికి సర్టిఫికేట్ కూడా అందజేశారు
ఒకే రోజు పుట్టిన రోజులు రావడం కోసం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదంతా ఆ దేవుడి దయ అని అమీర్ అలీ తెలిపాడు. అమీర్ అలీ - ఖుదేజా దంపతులకు ఉన్న ఏడుగురు సంతానంలో రెండు సార్లు కవల పిల్లలు పుట్టారు
ఇంతకూ వాళ్లు పుట్టిన డేట్ ఏమిటో తెలుసా.. ఆగస్టు 1.. ప్రతీ ఆగస్టు 1 వ తేదీన తమ కుటుంబం మొత్తం ఘనంగా బర్త్ డేతో పాటు తమ పెళ్లి రోజును నిర్వహించుకుంటామని అమీర్ అలీ దంపతులు తెలిపారు