స్విమ్ వేర్ బ్రాండ్ ను దింపిన బాలీవుడ్ బ్యూటీ

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లార్ మల్టీ ట్యాలెంటెడ్
ఓ వైపు ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. అయితే అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేకపోతోంది. తెలుగులో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో మానుషి మెరిసింది
ఇప్పుడు మానుషీ ఫ్యాషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. 'ద్వీప్' అనే కొత్త స్విమ్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. సస్టైనబుల్ స్విమ్‌వేర్ బ్రాండ్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది
ఇక తాను కూడా బికినీలో ఉన్న ఫోటోలను మానుషీ షేర్ చేసింది. మల్టిపుల్ కలర్స్, ప్యాటర్న్‌లతో, బీచ్ లో వేసుకోడానికి పర్ఫెక్ట్ అనిపించే కలెక్షన్‌ని ద్వీప్ లో మనం చూడొచ్చు
మానుషీ చిల్లర్ తన బ్రాండ్ కు సంబంధించి ఎరుపు రంగు బికినీ సెట్‌ను ధరించి కనిపించింది. మానుషి బికినీ టాప్‌తో మ్యాచింగ్ కోవ్ డబుల్ లేయర్ టై బికినీ బాటమ్స్‌తో సోషల్ మీడియాలో ఫైర్ కు కారణమైంది
మానుషీ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకుని వచ్చింది
మానుషీ డాక్టర్ కూడా అన్న సంగతి తెలిసిందే. ఆమె మిస్ వరల్డ్ గెలిచాక బాలీవుడ్ లో అడుగుపెట్టింది. యష్ రాజ్ ఫిలిమ్స్ తో మూడు సినిమాలకు మానుషీ సైన్ చేసింది
ఇక మానుషీకి సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒక్క హిట్ కూడా లేకపోవడం ఆమె యాక్టింగ్ కెరీర్ కు మైనస్ గా మారింది