రామ్ చరణ్-ఉపాసన.. లవ్ స్టోరీ మీకు తెలుసా?

నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని గతేడాది జూన్ 20న తమ మొదటి సంతానాన్ని స్వాగతించారు. ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది. క్లిన్ కారా అనే పేరును పెట్టారు
ఉపాసన కామినేనిని రామ్ చరణ్ 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు
రామ్ చరణ్, ఉపాసన జంట చూడముచ్చటగా ఉంటుందని వారి అభిమానులు చెబుతూ ఉంటారు. కపుల్ గోల్స్ సెట్ చేసే విషయానికి వస్తే వారు బార్‌ను ఒక మెట్టు పైకి పెంచారు
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయ్యారు. వారు తమ కాలేజీ రోజుల్లో లండన్‌లో మొదటిసారి కలుసుకున్నారు
ఆ సమయంలో, ఇద్దరు వ్యక్తులు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. రామ్ చరణ్ మౌనంగా ఉండటానికే ఇష్టపడుతుండగా, ఉపాసన ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారట. కాలేజ్‌ డేస్‌ ముగిసిన తర్వాత వారి స్నేహం మెల్లగా రిలేషన్‌షిప్‌గా మారింది
రామ్ చరణ్, తన ఐకానిక్ మూవీ మగధీర విడుదల తర్వాత ఉపాసనతో డేటింగ్ ప్రారంభించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు
ఒక అమ్మాయి ఉంది.. నాకు 7 సంవత్సరాల నుండి స్నేహం ఉంది. అందరూ ఆమెను నా భాగస్వామిగా చూడగలిగారు.నేనే కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాను. ఆ సమయంలోనే నేను సరైన అమ్మాయిని వెతుక్కుంటూ ఉన్నానని గ్రహించానని అప్పట్లో చెప్పారు
రామ్ చరణ్, ఉపాసన కొణిదెల మధ్య ప్రేమ చిగురించడంతో.. వారి కుటుంబాలు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఈ జంట దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 11, 2011న నిశ్చితార్థం చేసుకున్నారు
ఒక సంవత్సరం తర్వాత జూన్‌లో.. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన ఒక రోజు తర్వాత రామ్ చరణ్ తన అభిమానుల కోసం భోజనాలను కూడా ఏర్పాటు చేశాడు
వివాహం చేసుకున్నాక దశాబ్దం తర్వాత.. ఈ జంట తల్లిదండ్రులుగా వైవాహిక బంధంలో ఒక అడుగు ముందుకు వేశారు