హ్యాపీ బర్త్ డే నమ్రత.. మహేష్ బాబును మొదటిసారి ఎప్పుడు కలిశారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కెరీర్ సక్సెస్ ఫుల్ గా ఉండడానికి ఆయన బెటర్ హాఫ్ నమ్రత కూడా కారణం
మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టారు నమ్రత. హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించారు నమ్రత. అయితే మహేష్ బాబును పెళ్లి చేసుకున్నాక ఆమె హీరోయిన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసారు
1993లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు నమ్రత. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు
అదే సమయంలో మహేష్ కూడా హీరోగా నిలదొక్కుకుంటూ ఉన్నారు. "వంశీ" సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. మహేష్ కంటే నమ్రత నాలుగు సంవత్సరాల పెద్దది
2004 వరకు వారు తమ ప్రేమను బయట పెట్టలేదు. ప్రేమ వ్యవహారాన్ని ఎంతో రహస్యంగా ఉంచారు
2005లో, మహేష్- నమ్రత వివాహ బంధంతో ఏకమయ్యారు. ముంబైలోని మారియట్‌లో పెళ్లి జరిగింది
ఫిబ్రవరి 10, 2005న, తెలుగు సంప్రదాయ వేడుకలో, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు
వివాహానంతరం నమ్రత తన కెరీర్ ను పక్కన పెట్టేశారు. కుటుంబం కోసం ఆమె ఆలోచించేవారు. నమ్రత-మహేష్ బాబు జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు
పెళ్ళికి ముందు 5 సంవత్సరాలు తాము ప్రేమించుకున్నామని నమ్రత తెలిపారు. తామిద్దరూ కలిసి నటించిన వంశీ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. తమను కలిపిన సినిమా కాబట్టి ఎప్పటికీ స్పెషల్ అని చెబుతూ ఉంటారు నమ్రత