రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వం వహించిన 'చంద్రముఖి' 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది
చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' సినిమా రూపొందింది. లారెన్స్ - కంగనా ప్రధాన పాత్రలు పోషించారు
కథ పరంగా చూసుకుంటే.. రంగనాయకి శ్రీమంతురాలు. ఆమె కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. దీంతో ఏమి చేయాలా అని ఎదురుచూస్తున్న సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండే సిద్ధాంతి కులదైవాన్ని మరిచిపోవడం వల్లనే ఇలాంటి అనర్థాలు అని చెబుతారు
సొంత ఊరుకు వెళ్లి కులదైవాన్ని ఆరాధించాలని సూచించగానే రంగనాయకి తన కుటుంబంతో కలిసి.. సొంత ఊరుకి దగ్గరలో ఒక బంగ్లాను అద్దెకి తీసుకుంటారు
కులదైవం గుడి పాడుబడి పోవడంతో ఆ గుడిని బాగు చేయాలని అనుకుంటారు. అయితే అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి
ఇక వారు ఉంటున్న బంగళాలో కూడా ఎన్నో సమస్యలు. ఇంతలో ఆ కుటుంబంలో ఒకరిని చంద్రముఖి ఆవహిస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ
సినిమా పరంగా చంద్రముఖి చూసిన వాళ్లకు చంద్రముఖి-2 ఏ మాత్రం గొప్పగా అనిపించదు
అదే కథను మళ్ళీ చూసినట్లు అనిపిస్తుంది తప్పితే.. కొత్తదనం ఏమీ లేదు. ఒకానొక సమయంలో విసుగు తెప్పిస్తుంది
కామెడీ కూడా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతంపై కూడా విమర్శలు వచ్చాయి
ముఖ్యంగా రజనీకాంత్ స్వాగ్ ను.. జ్యోతిక ఛార్మ్ ను క్యారీ చేయడంలో లారెన్స్, కంగనా రనౌత్ విఫలమయ్యారని పెదవి విరుస్తూ ఉన్నారు. ఓవరాల్ గా బిలో యావరేజ్ మూవీగా నిలిచిపోయింది