బాలీవుడ్ లో 10 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న కృతి సనన్

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న యాక్ట్రెస్ కృతి సనన్. జయాపజయాలతో సంబంధం లేకుండా కృతి సనన్ తన సినిమా లైనప్ ను సాగిస్తూ వెళుతోంది
కృతి సనన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాను ఈ మైలు రాయిని చేరుకోడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది
"నేను హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు! నా జీవితంలో ఇప్పటివరకు అత్యుత్తమమైన, అత్యంత అద్భుత దశాబ్దం! ❤️ నిన్ననే మొదటిసారి సినిమా సెట్‌పైకి అడుగుపెట్టినట్లు అనిపించింది.." అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది.
2014 లో వచ్చిన హీరోపంతీ సినిమా ద్వారా కృతి నటిగా బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా తెలుగు 'పరుగు' సినిమా రీమేక్
కృతి సనన్ తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. తన మొదటి సినిమా మహేష్ బాబు సరసన 'వన్: నేనొక్కడినే'. ఆ తర్వాత దోచెయ్ సినిమాలో కూడా కృతి సనన్ కనిపించింది
ఇక ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ ప్రభాస్ సరసన నటించింది. ఈ సినిమాలో సీత పాత్రతో కృతి ఆకట్టుకుంది. అయితే సినిమాను జనం ఆదరించలేదు
అయితే బాలీవుడ్ లో మాత్రం 'క్రూ', తేరీ బాతోమ్ మే ఐసా ఉల్ఝా జియా' లాంటి హిట్స్ ను ఇటీవల సొంతం చేసుకుంది. కృతి దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది
కృతి సనన్ మిస్టరీ థ్రిల్లర్ 'దో పట్టి' సినిమాలో కాజోల్, షహీర్ షేక్, తన్వి అజ్మీ సరసన నటించనుంది